Rajagopalreddy: అమిత్‌ షా సమక్షంలో భాజపాలో చేరుతున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ఈనెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో భాజపాలో చేరనున్నట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు...

Updated : 05 Aug 2022 18:48 IST

దిల్లీ: ఈనెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో భాజపాలో చేరనున్నట్టు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. దిల్లీలో భాజపా నేత వివేక్‌తోపాటు ఆయన.. అమిత్‌ షాను కలిశారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇచ్చిన రాజీనామాను ఈనెల 8న సభాపతిని కలిసి ఆమోదింపజేసుకుంటానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం ఉన్నవారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండరన్న ఆయన.. తప్పుడు వ్యక్తి చేతుల్లోకి పీసీసీ పదవి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను రేవంత్‌రెడ్డి రుజువు చేయలేక పోయారని, ఇప్పటికైనా రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్‌రెడ్డి కోసం కాదని, తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని