KTR vs Bandi sanjay: ఉగాది వేళ.. కేటీఆర్, బండి సంజయ్ పొలిటికల్ పంచాంగం చూశారా!
భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయ ఉగాది పంచాంగం చెప్పుకొచ్చారు. పరస్పరం రాజకీయ విమర్శలతో సాగిన వీరిద్దరి పంచాంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్: ఉగాది పండుగ వేళ భాజపా, భారాస మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయ ఉగాది పంచాంగం చెప్పుకొచ్చారు. పరస్పరం రాజకీయ విమర్శలతో సాగిన వీరిద్దరి పంచాంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవిత ఈడీ విచారణ, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్న సమయంలో.. తాజాగా ఉగాది పంచాంగం రాజకీయవేడిని మరింత పెంచింది.
మంత్రి కేటీఆర్ చెప్పిన పంచాంగం ఇలా..
ఉగాది వేళ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ వినూత్నంగా ట్వీట్ చేశారు. ‘‘ఆదాయం: అదానీకి, వ్యయం: జనానికి, బ్యాంకులకు. అవమానం: నెహ్రూకి, రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి. బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
బండి సంజయ్ ట్వీట్ ..
‘‘ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి. వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి. అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు. రాజ పూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు. తుస్.. పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి. పతనం ఇక షురువాయే!!’’ అని ట్వీట్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
Siddharth: ‘టక్కర్’తో నా కల నెరవేరింది.. ఆయనకు రుణపడి ఉంటా: సిద్ధార్థ్
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
General News
APGEA: ఉద్యోగులపై పోలీసుల వేధింపులు ఆపాలి: ఆస్కార్‌రావు
-
Sports News
WTC Final: మరో రెండ్రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
-
Movies News
Adivi Sesh: ‘కర్మ’పై అడివి శేష్ ఆసక్తికర ట్వీట్.. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉందంటూ..