KTR: పార్టీ.. కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమే: కేటీఆర్‌

గత పదేళ్లలో పార్టీ, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు.

Published : 29 Jan 2024 16:18 IST

హైదరాబాద్: కారు సర్వీసింగ్‌కు పోయిందని.. తిరిగి వంద స్పీడుతో వస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. గత పదేళ్లలో పార్టీ, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనన్నారు. చేవెళ్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పాలనలో 6.50 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. కనీసం మంత్రిగా కూడా పని చేయని వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు పడలేదు. కేసీఆర్‌ ప్రభుత్వంలో సమయానికి పెట్టుబడి సాయం అందించాం. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు