Jackpot: క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి జాక్‌పాట్‌ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ. 10 వేల కోట్లకు పైగా గెలుచుకున్నాడు.

Published : 01 May 2024 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్‌బాల్‌ లాటరీ గేమ్‌లో భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నాడు. ఏకంగా 1.3 బిలియన్‌ డాలర్లను గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

లావోస్‌కు చెందిన 46 ఏళ్ల చెంగ్ సైఫాన్ కొన్నాళ్ల క్రితం అమెరికాకు వలసవచ్చారు. ఆయన కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఎనిమిదేళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పవర్‌బాల్‌ లాటరీలో చెంగ్‌ టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఇటీవల నిర్వహించిన ఈ డ్రాలో ఒక టికెట్‌.. మొత్తం ఐదు నంబర్లు (22, 27, 44, 52, 69)తో సరిపోలిందని.. దీని విలువ 1.3 బిలియన్‌ డాలర్లు (రూ. 10 వేల 842 కోట్లలకు పైగా) అని లాటరీ నిర్వాహకులు వెల్లడించారు.

కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్‌.. 9వేల డాలర్ల జరిమానా

టాక్స్‌లో భాగంగా 422 మిలియన్లు తగ్గించి మిగిలిన మొత్తాన్ని అతడికి చెల్లిస్తారు. లాటరీలో ఈ భారీ మొత్తాన్ని గెలిచుకోవడంపై చెంగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. టికెట్లు కొనేందుకు సాయం చేసిన తన భార్య, స్నేహితుడితో ఈ డబ్బు పంచుకుంటానని తెలిపారు. మెరుగైన చికిత్సకు వినియోగిస్తానంటూ పేర్కొన్నారు. పవర్‌బాల్‌ చరిత్రలో ఇది నాల్గవ అతి పెద్ద లాటరీ అని నిర్వాహకులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని