KTR: మోదీజీ.. చిత్తశుద్ధి ఉంటే ఆ విషయంలో జోక్యం చేసుకోండి: కేటీఆర్‌

గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

Updated : 17 Aug 2022 11:42 IST

హైదరాబాద్‌: గుజరాత్‌లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిషన్‌ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు గుజరాత్‌ ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ప్రధాని మోదీని ట్యాగ్‌ చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. 

మహిళలను గౌరవించాలంటూ మీరు చెప్పే మాటలపై చిత్తశుద్ధి ఉంటే.. గుజరాత్‌ ప్రభుత్వ రెమిషన్‌ ఆర్డర్‌పై జోక్యం చేసుకోవాలని మోదీని కేటీఆర్‌ కోరారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయించి.. దేశం పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలకు వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అసహ్యంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (IPC), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (CrPC)లో తగిన సవరణలు చేసి రేపిస్టులకు బెయిల్‌ రాకుండా చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

కేసు నేపథ్యమిదీ..

2002లో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబానికి సంబంధించిన ఏడుగురిని పాశవికంగా చంపేశారు. హతుల్లో బిల్కిస్‌కు చెందిన మూడున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరినీ గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం విడుదల చేశారు.ఈ వ్యవహారంలో గుజరాత్‌ సర్కారు తన చర్యను సమర్థించుకుంది. 1992 నాటి రెమిషన్‌ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపింది. దోషులను విడుదల చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు