జేజేపీలో ముసలం!

హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం.

Published : 10 May 2024 05:45 IST

ఖట్టర్‌తో నలుగురు ఎమ్మెల్యేల భేటీ
హరియాణాలో మారుతున్న సమీకరణాలు

చండీగఢ్‌: హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు ఇటీవల భాజపాకు మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ సర్కారు మెజారిటీని కోల్పోయిందని, బలపరీక్షను నిర్వహించాలని కోరుతూ జేజేపీ నేత దుశ్యంత్‌ చౌటాలా గురువారం గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. అనంతరం కొద్ది గంటల్లోనే ఆ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేలు భాజపా నేత, మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశం కావడం కలకలం సృష్టించింది. రాష్ట్ర మంత్రి మహిపాల్‌ దండా నివాసంలో దాదాపు అరగంట పాటు ఈ చర్చలు జరిగాయి. ఒకవేళ శాసనసభలో సీఎం బలపరీక్షను ఎదుర్కోవాల్సి వస్తే వీరు భాజపాకు మద్దతు పలికే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై వినతిపత్రం సమర్పించేందుకు తమ పార్టీ ప్రతినిధులతో కలిసి రాజ్‌భవన్‌కు వస్తామని, భేటీ అయ్యేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్‌ గవర్నర్‌ను కోరింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని