ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే

‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు.

Published : 10 May 2024 06:29 IST

‘ప్రతినిధి2’ చిత్ర ట్రైలర్‌ సందర్భంగా  తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, హైదరాబాద్‌: ‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. మంచి ప్రజా విధానాలు తీసుకొచ్చేవాళ్లు ఎవరో గమనించి.. ఎవరి పాలనలో సురక్షితంగా ఉంటామో ఆలోచించుకొని ఆ పార్టీకి ఓటు వేయాలి. ఓటు చాలా విలువైనది’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నారా రోహిత్‌ కథానాయకుడిగా నటించిన ‘ప్రతినిధి2’ ట్రైలర్‌ చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పాత్రికేయులు, దర్శకుడు మూర్తి బ్రహ్మాండమైన సినిమా తీసారు. ఓటు ఎంత విలువైనదో చాటి చెప్పే కథ ఇది. మంచి నాయకుడు, పార్టీ చేతుల్లో ఓటుని పెట్టుబడి పెట్టగలిగితే అది ప్రజల జీవితాన్నే మార్చేస్తుంది.  ఓటు వల్లే ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారు. ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. అవి ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి. ఆ విధానాలే ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. ఓటు వేయకపోవడం అంటే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘ప్రతినిధి 2’ సినిమా చూసి..13న ఓటు వేయాలని నా అభ్యర్థన’ అని చంద్రబాబు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని