Telangana news: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రే

తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రేను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 04 Jan 2023 21:48 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రే నియమితులయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న మాణికం ఠాగూర్‌ను రిలీవ్‌ చేసిన పార్టీ అధిష్ఠానం.. ఆయన స్థానంలో గోవా ఇన్‌ఛార్జిగా ఉన్న మాణిక్‌రావు ఠాక్రేను నియమించింది. మాణికం ఠాగూర్‌కు గోవా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరుపై మాణికం ఠాగూర్‌ గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల మధ్య వివాదం మరింత జఠిలం కావడానికి మాణికం ఠాగూర్‌ కూడా కారణమని సీనియర్‌ నేతలు ఆరోపించారు. వివాదం మొదలైనప్పుడు వెంటనే ఆయన స్పందించలేదు, పీసీసీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారనేది సీనియర్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయే క్రమంలో ఏఐసీసీ జోక్యం చేసుకుంది. ఈనేపథ్యంలోనే మాణికం ఠాగూర్‌ తెలంగాణ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి వైదొలిగినట్టు కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని