Harish rao: ఖమ్మంలో భారాస సభ.. దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుంది: హరీశ్‌రావు

ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్న భారాస బహిరంగ సభకు 13 నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈనెల 18న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు.

Updated : 16 Jan 2023 15:37 IST

ఖమ్మం: ఈనెల 18న ఖమ్మంలో భారాస (BRS) ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభగా మారుతుందని మంత్రి హరీశ్‌రావు (Harish rao) పునరుద్ఘాటించారు. వంద ఎకరాల్లో సభను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి.. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నామన్నారు. కార్యకర్తల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సభ నిర్వహణ, సీఎం కార్యక్రమాల గురించి ఆయన ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘‘ఎల్లుండి ఉదయం ప్రగతిభవన్‌లో జాతీయ నాయకులతో భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM Kcr) చర్చలు జరుపుతారు. అక్కడి నుంచి నేరుగా యాదాద్రి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం రెండు హెలికాప్టర్లలో ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకుంటారు. ఖమ్మంలోని నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తెలంగాణకు ముఖ్యఅతిథులుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు’’ అని హరీశ్‌రావు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని