Sonia Gandhi: దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం అమ్మేస్తోంది: సోనియా గాంధీ

భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని

Updated : 08 Dec 2021 13:06 IST

దిల్లీ: భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశ ఆస్తుల్ని మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని వస్తువుల ధరలు పెంచడంతో సామన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతుల విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా లేదని సోనియా గాంధీ అన్నారు. ఏడాది పొడవునా సాగిన ఉద్యమంలో అమరులైన 700 మంది రైతులకు ఘన నివాళి అర్పించాలని పార్టీ నేతలకు సూచించారు. రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం ఆమోదయోగ్యమైనది కాదని, చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదన్నారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలకు మద్దతుగా నిలవాలని పార్టీ ఎంపీలకు సోనియా గాంధీ సూచించారు.

మరోవైపు 12 మంది రాజ్యసభ ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని రాజ్యసభలోని విపక్ష పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారంతా పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని