Raghurama: నాపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ పి.సి.పంత్‌తో సమావేశమయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు

Updated : 31 May 2021 16:49 IST

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌కు ఎంపీ రఘురామ ఫిర్యాదు

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ పి.సి.పంత్‌తో సమావేశమయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును ఆయన స్వయంగా వివరించారు. సీఐడీ పోలీసులు విచారణలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని.. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ రఘురామకు తెలిపినట్లు సమాచారం.

ఏపీ సీఐడీ రఘురామను అరెస్ట్‌ చేసిన అనంతరం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఆయన కుమారుడు భరత్‌ ఫిర్యాదు చేశారు. భరత్‌ ఫిర్యాదు నేపథ్యంలో అంతర్గత విచారణకు ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని