Nara Lokesh: తెదేపా చేసిన పనుల్లో 10శాతమైనా వైకాపా చేసిందా?: లోకేశ్‌

వైకాపా ప్రభుత్వం, జగన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. బద్వేలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Updated : 12 Jun 2023 21:51 IST

‘‘నాది మిషన్‌ రాయలసీమ.. జగన్‌ది కమీషన్‌ రాయలసీమ
తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమైతే.. వైకాపా గజదొంగల కోసం..
తెదేపా అంటే అభివృద్ధి.. వైకాపాది అవినీతి
చంద్రబాబు విజనరీ అయితే.. జగన్‌ ఓ ప్రిజనరీ’’
అంటూ వైకాపా ప్రభుత్వం, జగన్‌పై నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు.

బద్వేల్‌: రాయలసీమ ప్రజలను వైఎస్‌ జగన్‌ మోసం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. బద్వేల్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టయినా పూర్తి చేసిందా? రాయలసీమకు ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చారా? తెదేపా చేసిన పనుల్లో 10శాతమైనా వైకాపా ప్రభుత్వం చేసిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మిషన్‌ రాయలసీమలో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని లోకేశ్‌ తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్‌ రాయలసీమ ద్వారా హామీలు నెరవేరుస్తామన్నారు. 

యువగళం పాదయాత్ర బద్వేల్‌లోకి ప్రవేశించగానే లోకేశ్‌కు అక్కడి ప్రజలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. లోకేశ్‌ని చూసేందుకు, వారి సమస్యలు విన్నవించేందుకు మహిళలు, వృద్ధులు, యువత భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. అందర్నీ లోకేశ్‌ ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ.. తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కరెంట్ బిల్లులు విపరీతంగా పెంచేశారని.. మే నెల బిల్లులు చూసి షాక్ అయ్యామని పలువురు మహిళలు లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఫ్యాన్‌ను పర్మినెంట్‌గా  స్విఛ్‌ ఆఫ్ చేసి సైకిల్ పాలన తెచ్చుకుంటే ప్రజలపై వేసిన భారం తగ్గిస్తామని లోకేశ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని