Nara Lokesh: 100 పథకాలు రద్దు చేసిన సీఎం జగన్‌: నారా లోకేశ్‌

వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 11 Mar 2024 15:20 IST

అనంతపురం: వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతను సీఎం మోసం చేశారన్నారు. కొత్త నోటిఫికేషన్లు వస్తాయని యువత ఆశగా ఎదురు చూసిందని చెప్పారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పింది జగన్‌ కాదా?అని ప్రశ్నించారు. ఐదేళ్లలో చేయని పనులు ఇప్పుడిప్పుడే  ఆయనకు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ ఏం చేశారో జగన్‌ను ప్రజలు నిలదీయాలని కోరారు. పథకాలన్నీ రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలోని 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగనే అని విమర్శించారు. ఈ ఐదేళ్లలో అన్ని ఛార్జీలను పెంచడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

తాడిపత్రిలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో లోకేశ్‌ మాట్లాడుతూ.. తాడిపత్రిలో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ఇక్కడి తెదేపా కార్యకర్తలపై వెయ్యి దొంగ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని