Andhra News: భజన చేసిన వారికే మంత్రి పదవులు: లోకేశ్‌

జగన్‌ సీఎం అయ్యాక అన్నింటి ధరలు పెంచుకుంటూ పోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామస్థులతో

Updated : 14 Apr 2022 06:33 IST

తాడేపల్లి: జగన్‌ సీఎం అయ్యాక అన్నింటి ధరలు పెంచుకుంటూ పోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామస్థులతో లోకేశ్‌ మాట్లాడారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు నిరసనగా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచి పెట్టారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. జగన్‌ కేబినెట్‌లోని మంత్రులంతా డమ్మీలేనని.. భజన చేసిన వారికే మంత్రి పదవులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు విద్యుత్‌ ఛార్జీలు పెంచనని చెప్పిన జగన్‌.. ఇవాళ మాటమార్చి ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని పెట్టారని ఆక్షేపించారు. వచ్చే నెల కరెంటు బిల్లులు వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు లోకేశ్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని