Congress: ఇప్పటికైతే ఆ నేత మార్పు లేనట్టే..!

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా అధిర్‌ రంజన్‌ చౌధరిని మార్చాలనే యోచనను అధిష్ఠానం వాయిదా వేసినట్టు సమాచారం. ఇప్పటికైతే ఆయన్నే ఆ పదవిలో కొనసాగించాలని .....

Published : 15 Jul 2021 01:37 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా అధిర్‌ రంజన్‌ చౌధరిని మార్చాలనే యోచనను అధిష్ఠానం వాయిదా వేసినట్టు సమాచారం. ఇప్పటికైతే ఆయన్నే ఆ పదవిలో కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ పార్లమెంటరీ గ్రూపు ఈ రోజు సమావేశమై జులై 19 నుంచి జరగబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనుంది. ఒకరికి ఒక పదవే ఉండాలన్న సిద్ధాంతం మేరకు అధిర్‌ రంజన్‌ మార్పు ఉంటుందంటూ పార్టీలోని ఓ వర్గం నేతలు ఇటీవల పేర్కొనడంతో ఊహాగానాలు చెలరేగాయి. ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం జరిగిపోయినట్టు ఓ నేత కూడా వ్యాఖ్యానించారు. అయితే, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తర్వాత పార్టీ సంస్థాగత మార్పుల సందర్భంలోనైనా లోక్‌సభాపక్ష నేతను మార్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తాజాగా పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ పక్ష నేతగా వ్యవహరిస్తున్న అధిర్‌ రంజన్‌ చౌధరి.. పశ్చిమ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షునిగా కూడా ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని