Rahul Gandhi: పార్లమెంట్‌ను నడిపే విధానం ఇదికాదు: రాహుల్ ఆగ్రహం

రాజ్యసభలో 12మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు మంగళవారం కూడా తమ .....

Published : 14 Dec 2021 18:51 IST

దిల్లీ: రాజ్యసభలో 12మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు మంగళవారం కూడా తమ నిరసనలు కొనసాగించాయి. ఇదే అంశంపై పార్లమెంట్‌ నుంచి విజయ చౌక్‌ వరకూ విపక్ష పార్టీల ఎంపీలు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. విపక్షాల గొంతుకను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్యచేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పార్లమెంట్‌లో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు విపక్ష పార్టీలకు అనుమతి ఇవ్వడంలేదన్నారు. చర్చల్లేకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయన్న రాహుల్‌.. ప్రధాని మోదీ కూడా సభకు హాజరు కావడంలేదని విమర్శించారు. 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి రెండు వారాలవుతోందని, ఆ ఎంపీలంతా బయటే కూర్చొంటున్నారన్నారు. పార్లమెంట్‌ను నడిపే విధానం ఇది కాదంటూ రాహుల్‌ మండిపడ్డారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని