Pawan Kalyan: శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే.. జగన్‌కూ: పవన్‌ కల్యాణ్‌

అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటబడి తరుముతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 14 Apr 2024 21:13 IST

తెనాలి: అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్‌ ప్రసంగించారు. రైతుల పాస్‌పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు వేస్తున్నారని మండిపడ్డారు.

‘‘ఒక ఆశయం కోసం వచ్చిన నాకు ఓటమి బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. రెండు చోట్లా ఓడిపోయినా తట్టుకుని ముందుకెళ్తున్నా. ప్రజలు మోసం చేశారని నేనేమీ వెనక్కి తగ్గలేదు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మళ్లీ జనం మధ్యకు వచ్చా. వకీల్‌ సాబ్‌ చెప్పినట్టు నేను మీ కూలీని. అధికారం ఇస్తే సంతోషంగా పనిచేస్తా. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు 5వ తేదీలోపు జీతాలు ఇస్తాం. వ్యాపార వర్గాలకు అండగా ఉంటాం. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తాం. కేవలం కులగణనే కాదు.. ప్రతిభను గణించి మహిళలను ప్రోత్సహిస్తాం. ప్రతి మహిళ ఏదో ఒక నైపుణ్యం పెంచుకోవాలి. 

కౌలు రైతులకు చేస్తున్న సాయం చిరంజీవిని కదిలించింది..

కౌలు రైతులకు జనసేన చేస్తున్న సాయం చూసి స్పందించిన అన్నయ్య చిరంజీవి రూ.5కోట్లు విరాళం ఇచ్చారు. సాయం చేయాలని రామ్‌చరణ్‌కు కూడా చెప్పారు. కౌలు రైతుల కోసం నేను చేసిన ప్రయత్నం ఆయన్ను కదిలించింది. ప్రజల కోసం బలంగా నిలబడ్డానని నన్ను ప్రశంసించారు. దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే శ్రీలంక అధ్యక్షుడికి పట్టే గతే జగన్‌కూ పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్‌లోకి కూడా జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది. జగన్‌కు అధికార గర్వం తలకెక్కింది, అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారు’’ అని పవన్‌ దుయ్యబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు