Payyavula: అరెస్టు చేసి ఆధారాలు తెస్తామనే కొత్త ఒరవడికి దర్యాప్తు సంస్థల శ్రీకారం: పయ్యావుల

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మొదటినుంచి చెబుతూనే ఉన్నామని తెదేపా సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ తెలిపారు.

Updated : 20 Nov 2023 19:07 IST

అమరావతి: స్కిల్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానికీ సీఐడీ ఆధారాలు సమర్పించలేకపోయిందని హైకోర్టు స్పష్టం చేసిందని తెదేపా సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ తెలిపారు. అరెస్టు చేసి ఆధారాలు తెస్తామనే కొత్త ఒరవడికి దర్యాప్తు సంస్థలు శ్రీకారం చుట్టాయన్నారు.

‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మొదటి నుంచి చెబుతున్నాం. కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి అసత్యాలు నమ్మించే ప్రయత్నం చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయారు. తెదేపా ఖాతాలోకి డబ్బు వచ్చిందని ప్రాథమిక ఆధారాలు కూడా చూపించలేకపోయారు. చంద్రబాబుకు లబ్ధి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. ఎక్కడో పన్ను ఎగవేత జరిగిందన్నారు. ఐటీ శాఖ విచారణలోనూ నిర్ధారణ కాలేదు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండానే 50 రోజులు చంద్రబాబు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని పయ్యావుల అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని