
రోడ్డు అవసరం లేదు.. కనీసం కంకరైనా వేయించండి: మేకపాటి విక్రమ్‌రెడ్డికి నిరసన సెగ
నెల్లూరు: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైకాపా నేతలకు ప్రజల నుంచి నిరసన సెగలు తప్పడం లేదు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో ఆత్మకూరు వైకాపా ఇన్‌ఛార్జి మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టారు. మేకపాటి కుటుంబం 30 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నా గ్రామానికి ఒక్కటంటే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలేకపోయారని ఓ గ్రామస్థుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్షం వస్తే బురదలో నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సారి ఓట్లు వేస్తే.. కచ్చితంగా రోడ్లు వేయిస్తామని విక్రమ్ రెడ్డి చెప్పగా.. రోడ్డు అవసరం లేదు.. కనీసం కంకర వేసినా సరిపోతుందని సమాధానం చెప్పడంతో అంతా కంగుతిన్నారు. మరోవైపు పలువురు మహిళలు తమ ఇంటికి రావొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలున్నా కనీసం పట్టించుకోవట్లేదని.. ఓట్లకు మాత్రం పరిగెత్తుకు వస్తున్నారని మండిపడ్డారు. అలాంటి సర్పంచ్ తమకు వద్దని.. ఈ సారి ఒక్క ఓటు వేయమని తెగేసి చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: అవే హెచ్చుతగ్గులు.. కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి..!
-
Business News
Stock Market Update: జులై నెలకు స్టాక్ మార్కెట్ల నష్టాల స్వాగతం
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20, వన్డేలకు.. టీమ్ఇండియా ఆటగాళ్ల ఎంపిక
-
Related-stories News
Sonu sood: కుమారుడి చికిత్స కోసం ఓ తల్లి తాపత్రయం.. సోనూసూద్ పేరుతో ఆన్లైన్ మోసం
-
Politics News
Shivsena: శివసేన ముందు ముళ్లబాట!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే