MLC Kavitha: యథాతథంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం రేపు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారాస ఎమ్మెల్సీ కవిత చేపట్టే నిరాహార దీక్ష యథాతథంగా కొనసాగనుంది.

Updated : 09 Mar 2023 18:57 IST

దిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం రేపు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారాస ఎమ్మెల్సీ కవిత చేపట్టే నిరాహార దీక్ష యథాతథంగా కొనసాగనుంది. ఈ దీక్షకు ఇవాళ మధ్యాహ్నం దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించగా.. వారితో భారాస జాగృతి సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. చర్చల అనంతరం దిల్లీ వెస్ట్‌జోన్‌ డీసీపీ మౌఖికంగా దీక్షకు అనుమతి ఇచ్చారు. దీంతో రేపటి దీక్షకు జాగృతి నేతలు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. దాదాపు 6వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దీక్ష కొనసాగనుంది. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి రేపటి దీక్షలో పాల్గొననున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని