Updated : 11 Apr 2022 21:47 IST

Andhra News: బుగ్గనకు ఆర్థికం.. వనితకు హోం.. ఏపీ మంత్రుల శాఖలివే

అమరావతి: ఏపీ కొత్త కేబినెట్‌లోని మంత్రులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. గత కేబినెట్‌ తరహాలోనే అయిదుగురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది. రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్‌ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ఉపముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు.

గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఈసారీ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌ చేపట్టిన శాఖలలో మార్పులు చేసి విద్యా శాఖను బొత్సకు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను సురేశ్‌కు కేటాయించారు. మొదటి నుంచీ రాష్ట్ర హోం శాఖను నగరి ఎమ్మెల్యే రోజాకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా హోంశాఖను తానేటి వనితకు కేటాయించారు. గతంలో మేకతోటి సుచరిత హోంశాఖ మంత్రిగా ఉన్నారు. రోజాకు రాష్ట్ర పర్యాటక, యువజన, క్రీడల శాఖను కేటాయించారు. ఆళ్లనానికి గతంలో వైద్యారోగ్యశాఖ కేటాయించగా.. ఇప్పుడు ఆ శాఖను విడదల రజనీకి కేటాయించారు. పౌరసరఫరాల బాధ్యతను గతంలో కొడాలి నాని చూడగా.. ఈసారి కారుమూరి నాగేశ్వరరావుకు కేటాయించారు. వ్యవసాయశాఖ బాధ్యతలను కురసాల కన్నబాబు నుంచి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి అప్పగించారు.

మంత్రులు.. కేటాయించిన శాఖలు

 • ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
 • సీదిరి అప్పలరాజు - పశుసంవర్ధక, మత్స్యశాఖ
 • దాడిశెట్టి రాజా - రహదారులు, భవనాల శాఖ
 • గుడివాడ అమర్నాథ్‌ - పరిశ్రమలు, ఐటీ శాఖ
 • వేణుగోపాల్‌ - బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాల శాఖ
 • తానేటి వనిత - హోం శాఖ
 • జోగి రమేష్‌ - గృహనిర్మాణ శాఖ
 • కారుమూరి నాగేశ్వరరావు - పౌర సరఫరాల శాఖ
 • మేరుగ నాగార్జున - సాంఘిక సంక్షేమ శాఖ
 • విడదల రజని - వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
 • కొట్టు సత్యనారాయణ - దేవాదాయ శాఖ
 • అంబటి రాంబాబు- జలవనరుల శాఖ
 • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- గనులు, అటవీ, ఇంధన, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
 • బుగ్గన రాజేంద్రనాథ్‌- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
 • కె.నారాయణ స్వామి-  ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ
 • బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
 • ఆదిమూలపు సురేశ్‌- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
 • కాకాణి గోవర్ధన్‌ రెడ్డి- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖలు
 • ఆర్‌కే రోజా- పర్యాటక, యువజన, క్రీడల శాఖ
 • పీడిక రాజన్న దొర- ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం
 • బూడి ముత్యాలనాయుడు- ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ
 • అంజాద్‌ బాషా- ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమం
 • గుమ్మనూరు జయరాం- కార్మిక శాఖ
 • ఉషశ్రీ చరణ్‌- మహిళా శిశుసంక్షేమశాఖ
 • పినిపే విశ్వరూప్ - రవాణాశాఖ


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని