
రామ మందిరానికి రఘురామకృష్ణరాజు విరాళం
హైదరాబాద్: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి పలువురు ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా తన మూడు నెలల వేతనాన్ని (రూ.3.9లక్షలు) విరాళంగా ఇచ్చినట్టు ట్విటర్‌లో వెల్లడించారు. ఈరోజు భక్తులతో కలిసి రూ.1,11,111లు అందజేసినట్టు తెలిపారు. శతాబ్దాల కాలం నాటి ఈ స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ ఎంతోకొంత మొత్తాన్ని ఇచ్చి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అది రూ.100లు అయినా రూ.లక్ష అయినా.. ఎవరి శక్తిమేరకు వారు విరాళంగా ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి..
రామ మందిరానికి ప్రముఖుల విరాళాలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.