బషీర్‌బాగ్‌ను మించి విద్యుత్‌ పోరాటం... తుపాకీ తూటాలకు నేనే ముందుంటా: రేవంత్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రత్యక్ష మిలిటెంట్‌ తరహా పోరాటాలకు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Published : 03 Apr 2022 01:40 IST

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రత్యక్ష మిలిటెంట్‌ తరహా పోరాటాలకు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... బషీర్‌బాగ్‌ను మించి వీరోచిత పోరాటం విద్యుత్‌సౌధ ముందు జరగాలని, ఇందులో అందరూ పాల్గొనాలని సూచించారు. కమ్యూనిస్టు సోదరులు కూడా ఇందుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. లాఠీ దెబ్బలకు, తుపాకీ తూటాలకు తానే ముందుంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌పార్టీ నిర్దిష్ట కార్యాచరణ తీసుకున్నట్టు ఆయన వివరించారు. ఈనెల 3న మీడియా సమావేశాలు, 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 6న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 7న విద్యుత్‌సౌధ, పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని