శశికళకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు 

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు.........

Updated : 21 Jan 2021 13:24 IST

బెంగళూరు: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. రాత్రి నుంచి శ్వాసతీసుకోవడంలో కూడా ఇబ్బంది పడటంతో ఆమెకు ర్యాపిడ్ యాంటిజెన్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్‌ నెగెటివ్‌గా తేలింది. అయితే, మరింత కచ్చితత్వం కోసం ఆమెకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేసినట్టు సమాచారం. మరికొద్ది గంటల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. జైలులోని ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటంతో కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో ఆమెను బెంగళూరులోని బోరింగ్ ఆస్పత్రికి తరలించారు. శశికళ ఆరోగ్య పరిస్థితి గురించి జైలు అధికారులు ఆమె లీగల్‌ టీంకు సమాచారం ఇచ్చారు. 

అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నట్ట్టు ఆమె తరఫు న్యాయవాది రాజా సెంథూరపాండియన్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

27న శశికళ విడుదల: మళ్లీ AIADMKలో చేరతారా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని