AP News: రాజధాని కట్టకుండా సెస్‌ ఎందుకు వసూలు చేస్తున్నారు: సోము వీర్రాజు

మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పిన జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నో వాగ్దానాలు చేసి రాజధానిని ఎక్కడికి పట్టుకెళ్లారని ...

Updated : 24 Sep 2022 15:37 IST

విజయవాడ: మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పిన జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నో వాగ్దానాలు చేసి రాజధానిని ఎక్కడికి పట్టుకెళ్లారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని కట్టకుండా  ఇవాళ్టికి కూడా రూ.4 సెస్‌ ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. రోడ్ల కోసమని రెండు రూపాయలు చొప్పున సెస్‌ వసూలు చేస్తున్నారు. కానీ, రోడ్ల మరమ్మతులు ఎక్కడ చేస్తున్నారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్‌ను అదోగతిపాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి దానికి జీఎస్టీ ఉన్నప్పుడు.. మద్యం అమ్మకాలకు బిల్లులు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి కేంద్రం 25లక్షల ఇళ్లు మంజూరు చేస్తోందని,  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రా రూ.10వేల కోట్లు ఇస్తోందని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులకోసం కేంద్రం రూ.35వేల కోట్లు మంజూరు చేసింది, మరో రూ.25వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని