Talasani Srinivas: చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరం: మంత్రి తలసాని

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Updated : 04 Oct 2023 16:45 IST

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో మంత్రిగా పని చేశా. ఆయన అరెస్టు వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలిగించింది. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకుడు చంద్రబాబు పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. 73 ఏళ్లు ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు’’ అని మంత్రి తలసాని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు