జగన్‌ ముందుంటే.. మేమంతా ఆయన వెంటే: అయ్యన్న

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి సీఎం జగన్‌ నాయకత్వం వహించాలని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. ..

Published : 06 Feb 2021 01:32 IST

విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి సీఎం జగన్‌ నాయకత్వం వహించాలని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. సీఎం ముందుంటే తామంతా ఆయన నాయకత్వంలో పోరాడేందుకు తామంతా సిద్ధమని సవాల్‌ విసిరారు. దిల్లీ వెళ్లి ప్రధాని వద్ద పోరాడదామని అయ్యన్న పిలుపునిచ్చారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

వైకాపా ఎంపీలతో వెళ్లి కేంద్రం మెడలు ఎందుకు వంచడం లేదని సీఎం జగన్‌ను అయ్యన్నపాత్రుడు నిలదీశారు. వైకాపా వాటాలు కొనాలని చూస్తోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఉక్కు కర్మాగారం లాంటి పెద్ద సమస్య వచ్చినపుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీఎంను ప్రశ్నించారు. ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు ఉందని ఆక్షేపించారు. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం చేద్దామన్నారు. 
ఉక్కు కర్మాగారంపై ప్రత్యక్షంగా 40వేల మంది, పరోక్షంగా లక్ష మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలంతా ఒకేమాటపై ఉండాలని అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

అలాంటి అధికారులకు బ్లాక్‌లిస్టే: మంత్రి పెద్దిరెడ్డి ప్రైవేటీకరణ నిర్ణయం ఒక్కరోజుది కాదు: సుజనా

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని