Amaravati: ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అభివృద్ధి చేయాలి: ధూళిపాళ్ల

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఆర్డీఏ

Updated : 03 Mar 2022 13:57 IST

అమరావతి: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజధాని వివాదాలకు సీఎం జగన్‌ స్వస్తి పలకాలని.. స్థానిక రైతులుపై కక్షపూరిత చర్యలు ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని