పీకల్లోతు నీటిలో ఇళ్ల స్థలాలా?:తెదేపా

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు నాలుగు అడుగులకుపైగా నీరు నిలిచింది. ఇక్కడి పేదలకు ఇళ్ల స్థలాలు పంచాలనే ఉద్దేశంతో అధికారులు ఎనిమిదిన్నర...

Updated : 13 Oct 2020 15:10 IST

ఏలేశ్వరం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు నాలుగు అడుగులకుపైగా నీరు నిలిచింది. ఇదే ప్రదేశంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం అధికారులు ఎనిమిదిన్నర ఎకరాల భూమిని సేకరించారు. వర్షాలు పడుతున్న ప్రతిసారీ ఈ స్థలాలు ముంపునకు గురవుతుండటంతో ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి వరుపుల రాజా, పార్టీ నేతలు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. పేదలకు కేటాయించిన ఈ స్థలాల్లో స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకొని ఉండగలరా? అని వరుపుల రాజా ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని