Andhra News: ‘ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే.. ఇప్పుడు ఫ్యాన్‌ తిరగట్లేదు’

జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని

Updated : 04 Apr 2022 14:04 IST

నర్సీపట్నం: జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఛార్జీల పెంపు, కరెంట్‌ కోతలతో కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. నర్సీపట్నంలో అయన్న మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 6న నర్సీపట్నంలో నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు.

పెరిగిన ఛార్జీల వల్ల కొత్త కంపెనీలు రావని.. ఫలితంగా ఉద్యోగాల కల్పన జరగదని అయ్యన్న అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై రూ.1,400 కోట్ల భారం పడుతోందన్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయించుకున్నారని.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ ఫ్యాన్‌ తిరిగేందుకు కరెంట్‌ లేదని అయ్యన్న ఎద్దేవా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని