Raghurama: ఏపీ అప్పులపై కాగ్‌ ఆడిట్‌ జరిపించాలి.. మోదీకి రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల విధానంపై కాగ్‌ ఆడిట్‌ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీని కోరారు. రూ. 25వేల కోట్ల అప్పుపై పూర్తి స్థాయిలో కాగ్‌తో

Updated : 23 Jul 2021 14:52 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల విధానంపై కాగ్‌ ఆడిట్‌ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీని కోరారు. రూ. 25వేల కోట్ల అప్పుపై పూర్తి స్థాయిలో కాగ్‌తో ఆడిట్‌ జరిపించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ పేరిట ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల కోసం సుమారు సంవత్సరానికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం ఉందన్నారు. చెప్పిందే చెప్పి.. చేసిందే చేసి.. ప్రచారాలు చేసుకుంటున్నారని రఘురామ మండిపడ్డారు. అంతిమంగా ఈ అప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇవాళో రేపో అనర్హత వేటు వేసే వ్యక్తి మాటలు ఎందుకు వినాలి అని అనుకోవద్దని హితవు పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని