
Published : 18 Nov 2021 01:52 IST
AP News: గొడ్డలిపోటు సూత్రధారి అవినాశ్‌రెడ్డే: లోకేశ్
అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి వాంగ్మూలం మేరకు గొడ్డలిపోటు సూత్రధారి అవినాశ్‌రెడ్డేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వివేకా హత్యకేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శిపై పాత్రపై అనుమానాలున్నాయన్నారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి అన్నీ తానై వ్యవహరించే వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవడంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ఈకేసు నుంచి అవినాశ్‌రెడ్డిని తప్పించేందుకు సిట్ బృందాన్ని మార్చేసి, సీబీఐ విచారణ వద్దన్నది జగనేనని గుర్తు చేశారు. జగన్ తన బులుగు మీడియాతో వైఎస్సాసుర చరిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారని నిలదీశారు.
Tags :