Atchannaidu: ఆంధ్రాలో ఉన్నామా? అఫ్గాన్‌లో ఉన్నామా?: తెదేపా నేతలు

తెదేపా అధినేత చంద్రబాబు నివాసం దగ్గర పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Updated : 17 Sep 2021 17:10 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నివాసం దగ్గర పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అఫ్గానిస్థాన్‌లా మార్చేశారని ధ్వజమెత్తారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక రౌడీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు తాలిబన్లను మించిపోయారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉన్నాయనే దానికి తాజా ఘటనే నిదర్శనమన్నారు.

‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట గలిసింది. రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? అధికార పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలతో పోల్చితే అయ్యన్న చేసిన వ్యాఖ్యలు ఒక శాతం కూడా లేవు.  వైకాపా నేతల భాషపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం క్షమాపణలు చెప్పిన తర్వాత అయ్యన్న వ్యాఖ్యలపై ఆలోచిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే గృహ నిర్బంధాలు చేస్తున్న పోలీసులు హెచ్చరించి వెళ్లిన వ్యక్తిని ఎందుకు అడ్డుకోలేదు? ఆంధ్రాలో ఉన్నామా? అఫ్గాన్‌లో ఉన్నామా? తెలియడం లేదు. అరాచక పాలన సాగిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సమస్యలపై తెదేపా పోరాటం ఆగదు’’ అని తెదేపా నేతలు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని