AP News: అవన్నీ చాలవన్నట్లు మోటార్లకు మీటర్లా?: అయ్యన్నపాత్రుడు

ఏపీలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి

Updated : 05 Oct 2021 20:19 IST

విశాఖ: ఏపీలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘‘పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో సీఎం, వ్యవసాయ మంత్రి విఫలయ్యారు. ప్రభుత్వ లెక్కలు, వాస్తవాలకు పొంతన లేకుండా ఉంది. రాయలసీమలో ఉల్లి, టమాటా, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దారుణంగా పడిపోయింది. కోస్తా జిల్లాల్లో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఇవన్నీ చాలవన్నట్లు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని