
RS praveen kumar: పాలకులు దోచుకున్న సొమ్మును గల్లా పట్టి తీసుకొస్తాం: ప్రవీణ్‌కుమార్
వరంగల్: పాలకులు దుర్మార్గంగా దోచుకున్న వేల కోట్ల రూపాయలను గల్లా పట్టి వాపస్ తీసుకొచ్చి.. ఆ డబ్బును విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం వెచ్చిస్తామని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన బీఎస్పీ ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఈ దేశానికి పాలకులమవుతామని జోస్యం చెప్పారు. ‘‘మేం అంబేడ్కర్, కాన్షీరాం వారసులం. మా రక్తంలో మాట తప్పే, మడమ తిప్పే లక్షణం లేదు. రాజ్యాంగం రాసిందే మా తాత అంబేడ్కర్. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, ఎస్సీ బిడ్డలే పాలకులవుతారు. బానిసలవుతారా? పాలకులవుతారా? మీరే తేల్చుకోవాలి. గులాబీ తెలంగాణ కాదు.. నీలి తెలంగాణ రావాలి. ఏనుగు గుర్తును గెలిపించాలని బహుజన దేవతలకు మొక్కాలి’’ అని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.