KTR: నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్‌

తెలంగాణకు నిధులివ్వకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్​మరోసారి ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన

Updated : 04 Jun 2022 17:30 IST

మహబూబ్‌నగర్‌: తెలంగాణకు నిధులివ్వకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ ​మరోసారి ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన, భూత్పూరు మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

‘‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పారు. కానీ, 8 ఏళ్లలో ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. వికారాబాద్‌-కర్ణాటక, గద్వాల-మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదు. కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ ఇచ్చింది. కానీ, రాష్ట్రానికి కేంద్రం రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే.. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా’’ అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.119 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని