Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్‌ ఇదే!

తమ పార్టీ ఎంపీపై భాజపా ఎంపీ రమేశ్‌ బిధూరీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు.

Updated : 22 Sep 2023 19:17 IST

లఖ్‌నవూ: తమ పార్టీ ఎంపీ డానిష్‌ అలీ(Danish Ali)పై భాజపా ఎంపీ రమేశ్‌ బిధూరీ(Ramesh Bidhuri) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) స్పందించారు. ఈ వ్యవహారంలో భాజపా ఇంతవరకు తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో స్పందించారు. ‘బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై భాజపా ఎంపీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి స్పీకర్ తొలగించడం, ఆ ఎంపీకి హెచ్చరికలు జారీచేయడంతో పాటు ఇదే అంశంపై ఓ సీనియర్‌ మంత్రి సభలో క్షమాపణలు చెప్పినప్పటికీ ఇంతవరకు భాజపా మాత్రం ఆయనపై తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరం’ అని పేర్కొన్నారు. 

బీఎస్పీ ఎంపీపై కామెంట్స్‌.. పార్టీ ఎంపీకి భాజపా షోకాజ్‌ నోటీస్‌

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల వేళ గురువారం చంద్రయాన్‌-3 విజయంపై చర్చ సందర్భంగా దిల్లీకి చెందిన భాజపా ఎంపీ రమేశ్‌ బిధూరీ (Ramesh Bidhuri) లోక్‌సభలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ(BSP)కి చెందిన ఎంపీ డానిష్‌ అలీపై చేసిన ఆ వ్యాఖ్యలను విపక్షాలు సైతం ఖండించాయి. ఆయన్ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. భాజపా సదరు ఎంపీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని