UP polls 2022: చివరి నిమిషంలో నామినేషన్‌కు మంత్రి పరుగో పరుగు!

ఉత్తర్‌ప్రదేశ్‌ బల్లియా జిల్లాలో శుక్రవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఫేఫ్నా స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి.......

Published : 06 Feb 2022 02:18 IST

లఖ్‌నవూ: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారాలు జోరందుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పోటీలో నిలిచిన పార్టీల నేతలు ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. అభ్యర్థులు నామినేషన్‌ను దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ బాలియా జిల్లాలో శుక్రవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఫేఫ్నా స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారి నామపత్రాలు దాఖలు చేయడానికి పరుగులు పెడుతూ కలెక్టరేట్​కు చేరుకున్నారు.

ఫిబ్రవరి 11వ తేదీ వరకు నామినేషన్‌ వేసేందుకు సమయం ఉన్నప్పటికీ.. శుక్రవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించేందుకు వచ్చిన ఉపేంద్ర తివారి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది సైతం ఆయన వెంట పరుగులు తీశారు. నామినేషన్ దాఖలుకు మరో మూడు నిమిషాలు మిగిలి ఉండగా చివర్లో అందజేశారు. సమయాభావం కావడంతోనే పరుగెత్తాల్సి వచ్చిందని ఆ తర్వాత మంత్రి తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని