Andhra News: రఘురామను టీవీ చర్చలకు రానివ్వకండి: సంసద్‌ సీఈవోకు విజయసాయిరెడ్డి లేఖ

సంసద్‌ (పార్లమెంట్‌) టీవీ చర్చల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును అనుమతించవద్దని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్‌ టీవీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి (సీఈవో) లేఖ

Updated : 29 Jun 2022 09:45 IST

ఈనాడు, దిల్లీ: సంసద్‌ (పార్లమెంట్‌) టీవీ చర్చల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును అనుమతించవద్దని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్‌ టీవీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి (సీఈవో) లేఖ రాశారు. చర్చల్లో రఘురామను వైకాపా ఎంపీగా చూపుతున్నారని తెలిపారు. ఆయన వైకాపా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని పేర్కొన్నారు. ఆయనపై అనర్హతకు సంబంధించిన పిటిషన్‌ సభాపతి వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ లోక్‌సభ కాలపరిమితి ముగిసే వరకు రఘురామను చర్చల్లో భాగస్వామిని చేయొద్దని కోరారు.

బహిష్కరించకుండా లేఖలా: రఘురామ

తనను పార్టీ నుంచి బహిష్కరించకుండా చర్చల్లో అనుమతించొద్దంటూ లేఖలు రాయలేరని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. విజయసాయిరెడ్డి లేఖపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కావాలంటే తనను బహిష్కరించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు