Pawan Kalyan: విశాఖలో పవన్‌ పర్యటనపై పోలీసుల ఆంక్షలు

వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.

Updated : 10 Aug 2023 10:42 IST

విశాఖపట్నం: వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని కోరారు. విమానాశ్రయం నుంచి  పోర్టు రోడ్డులోనే రావాలని స్పష్టం చేశారు. పవన్‌ ఎక్కడా రోడ్‌షో నిర్వహించొద్దని.. బయటికొచ్చి అభివాదాలు కూడా చేయొద్దని సూచించారు. వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం 5 గంటలకు నగరంలోని జగదాంబ కూడలిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని