YSRCP: తూచ్‌.. రుషికొండపై నిర్మిస్తోంది సెక్రటేరియట్‌ కాదు: వైకాపా మరో ట్వీట్

విశాఖపట్నంలోని రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై అధికార వైకాపా ఒక్కరోజులోనే మాట మార్చేసింది.

Updated : 13 Aug 2023 14:40 IST

అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై అధికార వైకాపా(YSRCP) ఒక్కరోజులోనే మాట మార్చేసింది. అక్కడ నిర్మిస్తున్నది సచివాలయమేనని శనివారం రాత్రి పేర్కొనగా.. దానిపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గుతూ ఆదివారం ఉదయం మరో ట్వీట్‌ చేసింది. 

‘‘మా అధికారిక ట్విటర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు’’ అని వైకాపా ఆదివారం ఉదయం పేర్కొంది.

Pattiseema: పట్టిసీమ నాపై పగబట్టిందే..!

శనివారం రాత్రి చేసిన ట్వీట్‌ ఏంటంటే..

‘‘ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్‌.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారు. దానిపై కూడా తెదేపా దుష్ప్రచారం చేస్తోంది. ఇది చూస్తుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం ఆ పార్టీకి ఇష్టం లేదనిపిస్తోంది’’ అని ట్వీట్‌లో పేర్కొంది. శనివారం రాత్రి చేసిన ట్వీట్‌ను వైకాపా డిలీట్‌ చేయడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని