YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్‌కు సీఎంవో నుంచి పిలుపు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేశ్‌ నాయుడుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది.

Updated : 19 Mar 2024 14:26 IST

అమరావతి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేశ్‌ నాయుడుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల పార్టీ ఆయనను ఇన్‌ఛార్జి పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత మంత్రి విడదల రజినీపై రాజేశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఆమె రూ.6.5కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే రూ.3కోట్లు మాత్రమే వెనక్కి ఇప్పించారని చెప్పారు. డబ్బు వసూలు వ్యవహారంపై సీఎంకు రాజేశ్‌ ఫిర్యాదు చేశారు. బయటివారికి టికెట్‌ ఇస్తే ఊరుకునేది లేదంటూ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత చిలకలూరిపేట అభ్యర్థిగా కావటి మనోహర్‌నాయుడును వైకాపా ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజేశ్‌ను సీఎం జగన్‌ పిలిపించి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని