Vaccine: ఒకే ఫోన్‌ నంబరుతో రెండు డోసులూ తీసుకోవాలి

కొవిడ్‌ టీకా మొదటి డోసు తీసుకున్న సమయంలో ఇచ్చిన ఫోన్‌ నంబరుతోనే రెండో డోసు కూడా పుచ్చుకోవాలని కేంద్రం లబ్ధిదారులకు సూచించింది.

Updated : 10 May 2022 10:45 IST

కొవిడ్‌ టీకా లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సూచన

దిల్లీ: కొవిడ్‌ టీకా మొదటి డోసు తీసుకున్న సమయంలో ఇచ్చిన ఫోన్‌ నంబరుతోనే రెండో డోసు కూడా పుచ్చుకోవాలని కేంద్రం లబ్ధిదారులకు సూచించింది. తద్వారా రెండు డోసులు పొందిన వివరాలను ఆయా లబ్ధిదారులతో ట్యాగ్‌ చేయడం సాధ్యపడుతుందని తెలిపింది. ఒకవేళ ఎవరైనా రెండో డోసు తీసుకోవడానికి వేరే ఫోన్‌ నంబరును వినియోగిస్తే... అది కూడా మొదటి డోసుగానే కొవిన్‌ పోర్టల్‌ పరిగణిస్తుందని వివరించింది. పుణెకు చెందిన 2.5 లక్షల మంది... మొదటి డోసు రెండుసార్లు తీసుకున్నట్టు ధ్రువపత్రాలు వచ్చాయంటూ మీడియాలో కథనాలు రావడంతో కేంద్రం సోమవారం స్పందించింది. ‘‘కొవిన్‌ పోర్టల్‌లో సమస్యలేమీ లేవు. రెండు డోసులు తీసుకున్నట్టు సంపూర్ణ వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ కావాలంటే.. 

ఒక్క ఫోన్‌ నంబరుతోనే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు ఫోన్‌ నంబర్లతో రెండు డోసులు పుచ్చుకుంటే... కేవలం పేరు, వయసు, జెండర్‌ను బట్టి పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌ పొందినట్టు ధ్రువీకరణ పత్రాలు జారీచేయడం కోట్ల మంది ప్రజలున్న మన దేశంలో చాలా కష్టం. డేటా ఎంట్రీ లోపాన్ని సాంకేతిక సమస్యగా పేర్కొనడం సరికాదు. మొదటి డోసు రెండుసార్లు తీసుకున్నట్టు ధ్రువపత్రాలు వచ్చినవారూ, ఇతరత్రా సమస్యలు తలెత్తినవారు కొవిన్‌ పోర్టల్‌లో ‘రైజ్‌ ఎన్‌ ఇష్యూ’ ఫీచర్‌ను ఉపయోగించి టీకా నమోదు వివరాల్లో లోపాలను సరిదిద్దుకోవచ్చు. ఇందుకు రిజిస్ట్రేషన్‌ సిబ్బంది లేదా హెల్ప్‌లైన్‌ నంబరు సాయం తీసుకోవచ్చు’’ అని కేంద్రం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని