నెరవేరిన పాక్‌ బామ్మ కల.. 75 ఏళ్ల తర్వాత స్వదేశానికి!

అల్లర్లకు భయపడి పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చింది 15 ఏళ్ల ఓ బాలిక. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు 90 ఏళ్ల వృద్ధురాలిగా స్వదేశానికి వెళ్లనుంది. అందుకు వీసా కూడా మంజూరైంది.

Updated : 20 May 2022 05:39 IST

అల్లర్లకు భయపడి పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చింది 15 ఏళ్ల ఓ బాలిక. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు 90 ఏళ్ల వృద్ధురాలిగా స్వదేశానికి వెళ్లనుంది. అందుకు వీసా కూడా మంజూరైంది. రీనా వర్మ అనే బామ్మ కథ ఇది. 1947 మే నెలలో రీనా రావల్పిండి ప్రేమ్‌ స్ట్రీట్‌లోని తన ఇంటిని విడిచిపెట్టి భారత్‌ చేరుకుంది. ఇక్కడే వివాహం చేసుకుంది. ఆమె కుమార్తె సోనాలీ గురుగ్రాంలో నివసిస్తోంది. ఎప్పటికైనా రావల్పిండిలోని తన సొంత ఇంటిని చూడాలన్నది రీనా కల.  అందుకు గతంలో 90 రోజుల వీసా కోసం రీనా చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైంది. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి మొదలైనప్పుడు, తమ చిన్ననాటి ఇంటి జ్ఞాపకాలను చూడాలనే కోరికను ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా పంచుకుంది రీనా. పుణెకు చెందిన ఈ బామ్మ కథ రావల్పిండిలో నివసించే సజ్జాద్‌ దృష్టిని ఆకర్షించింది. రీనా ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు పంపించారు. ఈ వ్యవహారమంతా పాక్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖార్‌ దృష్టికి చేరింది. దీంతో రీనాకు 90 రోజుల వీసాను మంజూరు చేశారు మంత్రి హీనా. జులైలో సొంత ఇంటికి వెళ్తానని రీనా చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని