వాతావరణ మార్పులపై కామన్వెల్త్‌ పోరు

కరోనా మహమ్మారి వల్ల వాతావరణ మార్పులపై పోరాటం ఆలస్యమవుతోంది. మలేరియా వంటి ఉష్ణమండల వ్యాధుల నియంత్రణ కూడా మందగించింది. వీటిని మళ్లీ గాడిన పెట్టే అంశంపై కామన్వెల్త్‌ దేశాల నాయకులు రువాండా రాజధాని కిగాలిలో

Published : 25 Jun 2022 05:51 IST

కిగాలి: కరోనా మహమ్మారి వల్ల వాతావరణ మార్పులపై పోరాటం ఆలస్యమవుతోంది. మలేరియా వంటి ఉష్ణమండల వ్యాధుల నియంత్రణ కూడా మందగించింది. వీటిని మళ్లీ గాడిన పెట్టే అంశంపై కామన్వెల్త్‌ దేశాల నాయకులు రువాండా రాజధాని కిగాలిలో చర్చలు ప్రారంభించారు. 54 దేశాల సంఘమైన కామన్వెల్త్‌లో 250 కోట్ల మంది నివసిస్తున్నారు. కామన్వెల్త్‌కు అలంకారప్రాయ అధిపతిగా బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌-2 వ్యవహరిస్తున్నారు. 96 ఏళ్ల వయసులో ఆమె పెద్దగా కదలలేకపోతున్నందున... ఆమె కుమారుడు ఛార్లెస్‌ ఈసారి కామన్వెల్త్‌ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తోపాటు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్‌ బుహారి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

కామన్వెల్త్‌ శిఖరాగ్ర సభాస్థలంలో వాతావారణ మార్పులపైన, ఉష్ణమండల వ్యాధులపైనా పోరాటానికి ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. ప్రపంచమంతటా మలేరియా తదితర వ్యాధుల నియంత్రణకు 400 కోట్ల డాలర్లు కేటాయించాలని ఒప్పందం కుదిరింది. కామన్వెల్త్‌ ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు రంగం, కొందరు వితరణశీలురు ఈ నిధులను సమకూరుస్తారు. మలేరియా తదితర రోగాల చికిత్సకు 1,800 కోట్ల మాత్రలను ఫార్మా కంపెనీలు విరాళంగా ఇచ్చాయి. మలేరియా కారణంగా ఆఫ్రికాలో ఏటా వేలమంది మృత్యువాత పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని