కేరళలో ఆంత్రాక్స్‌ కలకలం

కేరళలో ఆంత్రాక్స్‌ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని అత్తిరాప్పిళ్లి అటవీ ప్రాంతంలో కొద్దిరోజులుగా అడవి పందులు ఈ వ్యాధితో చనిపోతున్నాయి. దీనిపై ఆందోళన అవసరంలేదని త్రిశూర్‌ కలెక్టర్‌ హరిత వి కుమార్‌ గురువారం తెలిపారు. ఈ ప్రాంతంలోని

Published : 01 Jul 2022 06:34 IST

 అడవి పందుల్లో కనిపించిన వ్యాధి

తిరువనంతపురం: కేరళలో ఆంత్రాక్స్‌ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని అత్తిరాప్పిళ్లి అటవీ ప్రాంతంలో కొద్దిరోజులుగా అడవి పందులు ఈ వ్యాధితో చనిపోతున్నాయి. దీనిపై ఆందోళన అవసరంలేదని త్రిశూర్‌ కలెక్టర్‌ హరిత వి కుమార్‌ గురువారం తెలిపారు. ఈ ప్రాంతంలోని పెంపుడు జంతువులు, పశువుల్లో ఆంత్రాక్స్‌ లక్షణాలేమీ కనిపించలేదన్నారు. అరుదుగానే ఈ వ్యాధి జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని ఆమె చెప్పారు. అయితే అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పశువులకు టీకాలు వేయడం వంటి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యాధి పట్ల రాష్ట్ర ఆరోగ్య, పశు సంవర్థకశాఖలు అప్రమత్తంగా ఉన్నాయని అటవీశాఖ మంత్రి ఎ.కె.శశీంద్రన్‌ తెలిపారు. పశువులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం మొదలైనట్లు త్రిశూర్‌ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఆంత్రాక్స్‌తో ఆరు అడవి పందులు చనిపోయాయని పేర్కొన్నారు. బాసిలస్‌ ఆంత్రాసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల ఆంత్రాక్స్‌ సంక్రమిస్తుంది. ఇది పశువులు, మేకలు, గొర్రెలు, అడవి జంతువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అరుదుగా వాటి నుంచి మానవులకు వ్యాపిస్తుంటుంది. ఆంత్రాక్స్‌ సోకిన జంతువుల మాంసం తినడం, వాటి కళేబరాలను తరలించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చు. వాటి చర్మాలను తొలిచేవారికీ ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. జ్వరం, రక్తపు విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై పుండ్లు, జలుబు, వాంతులు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. సత్వరం చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకం కావొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని