ప్రాక్టీస్‌: రహానె సెంచరీ..భారత్ 237/8

ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌-ఎ జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్య రహానె

Published : 06 Dec 2020 14:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌-ఎ జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్య రహానె (108*) శతకంతో సత్తాచాటగా, పుజారా (54) అర్ధశతకం సాధించాడు. కాగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఓపెనర్లు పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరారు. హనుమ విహారి (15) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానెతో కలిసి పుజారా వికెట్ల పతనాన్ని ఆపాడు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో అర్ధశతకాలు అందుకున్నారు. కాగా, పుజారాను ప్యాటిన్సన్‌ ఔట్‌ చేసి మరోసారి భారత్‌-ఎ జట్టును దెబ్బతీశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా (0), అశ్విన్‌ (5) కూడా విఫలమవ్వడంతో జట్టు స్కోరు 170 పరుగులు కూడా దాటదనిపించింది. కానీ రహానె టెయిలెండర్లతో కలిసి గొప్పగా ఆడాడు. అజేయ శతకంతో తొలి రోజు ఆఖరి వరకు క్రీజులో నిలబడ్డాడు. కుల్‌దీప్‌ (15), ఉమేశ్‌ యాదవ్‌ (24) పరుగులు సాధించారు. ఆసీస్‌-ఎ జట్టు బౌలర్లలో ప్యాటిన్సన్‌ మూడు, మైకేల్‌ నెసర్‌, ట్రేవెస్‌ హెడ్ చెరో రెండు, బర్డ్ ఒక్క వికెట్‌ తీశారు.

ఇదీ చదవండి

భారత్×ఆస్ట్రేలియా రెండో టీ20 లైవ్‌ అప్‌డేట్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని