ఆస్ట్రేలియా తొలి వికెట్‌

సోమవారం మూడో రోజు ఆటలో భారత్‌ 326 పరుగులకు ఆలౌటవ్వగా.. అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. 131 పరుగుల భారీ లోటుతో బరిలోకి దిగిన...

Published : 28 Dec 2020 08:03 IST

మెల్‌బోర్న్‌: సోమవారం మూడో రోజు ఆటలో భారత్ తొలి సెషన్‌లో‌ 326 పరుగులకు ఆలౌటవ్వగా.. భోజన విరామం తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. 131 పరుగుల భారీ లోటుతో బరిలోకి దిగిన ఆ జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 3.1 ఓవర్‌కు జోబర్న్స్‌(4) ఔటయ్యాడు. బంతి ఎడ్జ్‌ తీసుకొని కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతుల్లో పడడంతో ఆసీస్‌ 4 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. 5 ఓవర్లకు‌ ఆస్ట్రేలియా స్కోర్‌ 8/1గా నమోదైంది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూవేడ్‌, మార్నస్‌ లబుషేన్‌ ఉన్నారు. 

ఇవీ చదవండి..
ఈ దశాబ్దపు సారథులు ధోని, కోహ్లి
పట్టు బిగించిన భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని