సచిన్‌లోని పిల్లాడు అలాగే ఉన్నాడు: సారా

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఎంత ఎదిగినా అతడిలోని చిన్నపిల్లాడు ఇంకా అలాగే ఉన్నాడని కూతురు సారా తెందూల్కర్‌ అన్నారు. అందరి చిన్నపిల్లల్లాగే లిటిల్‌ మాస్టర్‌...

Published : 16 Jul 2020 13:11 IST

ముంబయి వర్షాలను ఆస్వాదించిన క్రికెట్‌ దిగ్గజం

ముంబయి: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఎంత ఎదిగినా అతడిలోని చిన్నపిల్లాడు ఇంకా అలాగే ఉన్నాడని కూతురు సారా తెందూల్కర్‌ అన్నారు. అందరి చిన్నపిల్లల్లాగే లిటిల్‌ మాస్టర్‌ బుధవారం తన ఇంటి ఆవరణలో వర్షపు చినుకుల్లో తడిసి ముద్దయ్యాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకొని సండడి చేశాడు. ముంబయి మహా నగరంలో ఇటీవల జోరున వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న వర్షం కురిసిన వేళ సచిన్‌ కాసేపు వాననీటిలో సేద తీరాడు. ఆ ఘటనంతా సారా వీడియో తీయగా దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. 

‘నా ఫెవరెట్‌ కెమెరావుమన్‌ సారా తెందూల్కర్‌. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను నేను ఆస్వాదించడం చిత్రీకరించింది. ఈ వర్షపు చినుకులు ఎప్పుడూ నా చిన్నతనాన్ని గుర్తుచేస్తాయి’ అని లిటిల్‌మాస్టర్‌ వ్యాఖ్యానించాడు. అదే వీడియోలో సారా మాట్లాడుతూ తన తండ్రిలోని చిన్నపిల్లాడు ఇంకా అలాగే ఉన్నాడని పేర్కొన్నారు. మరోవైపు ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. థేన్‌, పాల్‌ఘర్‌, రాయిగడ్‌, రత్నగిరి, సిందుదర్గ్‌ ప్రాంతాల్లో బుధవారం ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఇక లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచీ ఇంటికే పరిమితమైన సచిన్‌ కుటుంబ సభ్యులతో కలిసి మంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలాగే ఇంటి పనులు కూడా చేస్తున్నాడు. కాగా, ముంబయిలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,75,640 కరోనా కేసులు నమోదు కాగా 10,928 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,12,099 మంది యాక్టివ్‌ కేసులుగా ఉండగా, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 1,52,613కి చేరింది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని