
కమిన్స్‌ను చూసి నేర్చుకోవాలి: యువీ
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్, కోల్‌కతా ఆటగాడు కమిన్స్ తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అభిమానులంతా కమిన్స్‌ను విమర్శించారు. అయితే శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ కట్టుదిట్టంగా బంతులు వేశాడు. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. కీలక సమయంలో హైదరాబాద్ ఓపెనర్ బెయిర్‌స్టోను అవుట్ చేశాడు. కమిన్స్ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ స్పందించాడు. కమిన్స్‌ను చూసి యువబౌలర్లు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.
‘కమిన్స్ తిరిగి లయ అందుకున్న తీరు అద్భుతం. తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. తర్వాతి మ్యాచ్‌లో తన నాణ్యమైన బంతులతో హైదరాబాద్ జట్టును ఇబ్బంది పెట్టాడు. చాలా మంది యువబౌలర్లు తొలినాళ్లలో ఇబ్బంది పడి తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అలాంటి వాళ్లు బంతితో తిరిగి ఎలా రాణించవచ్చో కమిన్స్‌ను చూసి నేర్చుకోవాలి’ అని యువీ పేర్కొన్నాడు.
కోల్‌కతా జట్టులో కమిన్స్‌కు తోడు మిగతా బౌలర్లు కూడా రాణించడంతో ప్రత్యర్థి జట్టు 142 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కోల్‌కతా బ్యాట్స్‌మన్ శుభ్‌మన్‌గిల్ (70) రాణించాడు. దీంతో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.